ఎంటర్ కొట్టడం వచ్చు కాని గూగుల్ సెర్చ్ బాక్స్ లో ఏమి టైపు చేయాలో మాకు ఏమి తెలుసు అంటారా?
అయితే క్రింద వున్న టిప్స్,ట్రిక్స్,ఇమేజెస్, వీడియోస్,మీకు F1 చేస్తాయి. అదేనండి హెల్ప్ చేస్తాయి...
ప్రతి వర్డ్ ముఖ్యమే :: సాదారణం గా సెర్చ్ ఇంజన్స్ టైపు చేసిన ప్రతి వార్డ్ ని వుపయోగించుకుంటాయి. కాని కొన్ని సందర్బాలలో మాత్రం కొన్నిటిని వుపయోగించుకోవు...
సింపుల్ గా టైపు చేయండి:: సింపుల్ ఈజ్ డింపుల్, బాగా పెద్ద పెద్ద సెంటెన్స్లు రాయకుండా సింపుల్ గా క్లూ వర్డ్స్ రాయండి..
కలిసేలా రాయండి:: మీకు కావలసిన పేజి లో మీకు ఏ వర్డ్స్ ఎక్కువగా వుంటాయని మీరు అనుకుంటారో అవి మాత్రమె రాస్తే సెర్చ్ ఇంజన్ కి ఈజీ గా వుంటుంది.ఎందుకంటే అది మనిషి కాదు..
వుదాహరణకి: "my head hurts" అనే బదులు "headache" అని రాయాలి ఎందుకంటే ఆ వర్డ్ మెడికల్ సైట్స్ లో ఎక్కువగా వుండే అవకాసం వుంది..
తక్కువ వర్డ్స్:: వీలయినంత తక్కువ వర్డ్స్ తో మీకు కావలసిన సైట్ ని వివరించండి.ఒక్కోసారి వర్డ్స్ ఎక్కువయ్యే కొద్ది సెర్చ్ ఇంజన్ కన్ఫ్యూజ్ అవుతుంది.ఒక్కోసారి అస్సలు సంబంధం లేని సైట్స్ రిజల్ట్స్ ని కూడా ఇవ్వచ్చు.
వివరించేదిగా:: మీరు యూజ్ చేసే వర్డ్స్ అన్ని మీకు కావలసిన రిజల్ట్ ని వివరించేదిగా వుండాలి..
చూసారా,ఓన్లీ గూగుల్ అని సెర్చ్ చేస్తే ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయో..
![[Image: diagram.jpg]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/diagram.jpg)
ఇంకొన్ని టిప్స్ చూద్దాం:
" మార్క్స్ ని యూజ్ చేయండి:: మీకు ఇంటర్నెట్ మార్కెటింగ్ గురించి కావాలంటే డైరెక్ట్ గ అదే టైపు చేయకుండా అటూ ఇటు ".........." మార్క్స్ ని యూజ్ చేస్తే కర్రెక్ట్ రిజల్ట్స్ వస్తాయి..
సబ్-పార్ట్స్ కావాలంటే:: అలాగే మీకు ఇంటర్నెట్ మార్కెటింగ్ లో Advertising కావాలంటే "internet marketing - advertising" అని టైపు చేయాలి..
ఒక సైట్ ని వెతకండి:: ఒక సైట్ లోని స్పెసిఫిక్ వర్డ్ కావాలంటే ఇలా సెర్చ్ చేయండి..
Example: "internet marketing" site:www.smallbusinesshub.com
పర్యాయ పదాలు:: ఒక పదానికి దగ్గర పదంతో రిజల్ట్స్ కావాలంటే ఈ గుర్తు ~ తో ట్రై చేయండి..
Example: "internet marketing" ~professional
డాకుమెంట్స్ టైప్స్:: మీకు ఏ టైపు ఫైల్స్ కావాలో కూడా మీరే చెప్పచ్చు ఇలా...
Example: "internet marketing" filetype:ppt
ఇదీ లేక అది:: మీకు రెండు పదాలలో ఏది సరిపోయినా పర్వాలేదు అనుకుంటే రెండు సార్లు సెర్చ్ చేయనవసరం లేదు. ఇలా ట్రై చేయండి.. OR ఆపరేటర్ ని యూజ్ చేయండి.. గమనిక OR ని మాత్రం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి..
Example: internet marketing OR advertising
నెంబర్ కనుక్కోండి:: మీకు ఎవరినా తెలియని వారు కాల్ చేసి ఏడిపిస్తుంటే వారు ఎవరో ఇలా తెలుసు కోవచ్చు.
Example: phonebook:617-555-1212
ఏరియా కోడ్ ని కనుక్కోండి:: మీకు ఒక కోడ్ ఏ ఏరియా దో కనుక్కోవాలంటే డైరెక్ట్ గా ఆ పిన్ ని ఎంటర్ చేయండి...
Example: 617
తెలుసుకోండి:: ఇది ఎప్పుడో యూజ్ చేసేది అయిన బాగా వుపయోగ పడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి మీకే అర్ధం అవుతుంది..
Example: president 1940..1950
అంటే 1940 నుండి 1950 దాక ఎవరు ప్రెసిడెంట్ అనేది తెలుసుకోవచ్చు.
క్యాలుకులేటర్:: గూగుల్ ని క్యాలుకులేటర్ గా కూడా యూజ్ చెయ్యచ్చు ఇలా...
Example: 48512 * 1.02
అర్ధం తెలుసుకోండి:: మీకు తెలియని పదాలకు అర్దాలు కూడా తెలుసు కోవచ్చు..
Example: define:plethora
ధన్యవాదాలు...
0 comments:
Post a Comment