Friday, August 28, 2009

ఒకానొక జోక్........

అనగనగా ఒక "రిచ్చి" పర్సన్ వుండేవాడు. అతనికి ఒక కొడుకు వుండేవాడు.కొడుకు అంటే ఆ "రిచ్చి" పర్సన్ కి చచ్చేంత "పిచ్చి". అందుకే కొడుకు ఏదడిగినా కాదు అనేవాడు. ఆ కొడుకుకి బాగా బద్ధకం వచ్చేసింది. అందుకే "నాన్న నా పనులన్నీ చేసుకోలేకపోతున్నా నాకు నా పనులు చేయడానికి ఏదయినా కంప్యూటర్ సిస్టం పెట్టవా " అని అడిగాడు.

కొడుకు మీద ప్రేమతో కొడుకు అడిగినంత పనీ చేసాడు..
తన కొడుకుని పిలిచి తండ్రి ఇలా చెప్పసాగాడు.
ఇటు చూడు ఈ ఎర్ర బటన్ ని నొక్కితే నీ దగ్గరకి బాత్రూం వస్తుంది, పేస్టు,బ్రష్,టవల్,సోప్,వాటర్ అన్ని వస్తాయి, నువ్వు లేచే పని లేదు..
ఇటు చూడు ఈ పచ్చ బటన్ నొక్కితే నీ దగ్గరికే నీ బట్టలు,సాక్స్,టై,బూట్లు, అన్నీ వస్తాయి
ఇటు చూడు ఈ పసుపు బటన్ నొక్కితే నీ దగ్గరికే కార్ వచ్చి డైరెక్ట్ గా ఆఫీసు లో నీ సీట్ లో కూర్చో పెడుతుంది.
ఇటు చూడు ఈ పింక్ బటన్ నొక్కితే నీకు ఏది కావాలన్న తెచ్చి పెట్టె పని వాళ్ళు వస్తారు.

ఇవన్ని నువ్వు గుర్తు వుంచుకునే పని లేకుండా ఇక్కడ ఈ నాలుగు బటన్స్ పక్కనే రాసి అతికించా చూడు, ఇవన్ని నీ బెడ్ దగ్గరే వుండడం వాళ్ళ నువ్వు లేచే పని కూడా లేదు.

నువ్వు నా కొడుకువిరా నువ్వు అడగటం నేను చేయకపోవటం కూడానా, అందుకే ఎంతో కస్టపడి ఇవన్ని సమకూర్చాను నువ్వు సంతోషమేనా??

నాన్న..............., నాన్న.....................,


మరే..................మరే..........................,



అంతా బానే వుంది కాని ఈ నాలుగు బటన్స్ నేనే నొక్కాలా నాన్నా??

గమనిక:: ఇది నేను మిమ్మల్ని నవ్వించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే, ఈ జోక్ మనలో చాలా మందికి రియల్ గా, చాలా దగ్గరగా చూసినట్టు, మన కదే అన్నట్టు అనిపించచ్చు,జోక్ వస్తే నవ్వండి,రాక పోతే నవ్వకండి.. మొత్తానికి ఏ ఫీలింగ్ ని అయినా చెప్పండి... వుంటాను బటన్ నొక్కే టైం అయ్యింది.

0 comments:

Post a Comment