నాకు "ఆడవారి మాటలకు అర్దాలే వేరులే" సినిమా అంటే చచ్చేంత పిచ్చి,ఎంత పిచ్చి అంటే ఆ సినిమా పాటలు ఇప్పటికి 200 సార్లు విన్నానంటే మీరు నమ్మగలరా? సినిమా ని కూడా ఇప్పటికి రెండు సి.డీ.లు అరిగే లా చూసానన్నా నమ్మగలరా? అంత ఇష్టమయిన ఆ సాంగ్స్ లిరిక్స్ కోసం తిరగని షాప్ లేదు,కాని ఈ [e] కాలం లో అవన్నీ ఎవరు అమ్ముతారు. అందుకే ఇంటర్ నెట్ మీద పడ్డాను,ఇక్కడ కూడా అలా వెతికి వెతికి వెతికి ఒక సైట్ ని పట్టి నాకు కావలసిన లిరిక్స్ ప్రింట్ తీసుకున్నాను.ఆ సైట్ ని మరచిపోయాను.మళ్ళి కొన్నల్టికి ఇంకో లిరిక్స్ అవసరం అయ్యాయి అందుకే మళ్ళి కష్టపడి వెతికి వెతికి వెతికి ఇన్నాళ్టికి పట్టుకున్నాను.అందుకే మరచిపోయే లోపల మీకు చెప్పాలని ఈ పోస్ట్ చేస్తున్నాను.
అసలయితే ఈ సైట్ అసలు అడ్రస్ ఇది
www.telugudanam-patalu.blogspot.com/
కాని నేను ఈజీగ వుంటుందని ఇలా మార్చాను,
www.sai-lyrics.tk
ఇది తప్పని నాకు తెలుసు ఇది టాలెంట్ చోర్ క్రింద వస్తుంది కాని నా సౌలబ్యం కొరకు ఇలా మార్చాను. అందరు తప్పకుండా వుపయోగించుకొండి.మీకు తెలిసిన లిరిక్స్ కూడా పోస్ట్ చేయండి..బయ్

0 comments:
Post a Comment