ఈ పోస్ట్ ఎందుకు రాస్తున్నానంటే:-
ఎప్పటి నుంచో మా అక్క కి షిరిడి వెళ్ళాలని వుంది(మా అక్క సాయి బాబా కి ఏ.సి. లెండి).కాని ఇప్పటికి (07-07-09) ఆ అవకాశం దొరికింది. కొంచెం గందరగోళం గా స్టార్ట్ అయినా కూడా బాగానే జరిగింది.మేము ఫస్ట్ టైం ఈ స్టేట్ దాటి వెళ్ళటం.అందువల్ల మేము కొన్ని ఇబ్బందులు పది ఎలా గోలా షిరిడి ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసాం. అలాంటి ఇబ్బందులు మీరు కూడా పడకూడదని ఈ పోస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ని సద్వినియోగ పరచుకుంటారని ఆసిస్తూ .
మీ అందరి
సాయి కృష్ణ
షిర్డీ మహారాష్ట్ర లో వుంది. షిరిడి లో మొదట్లో మహా అయితే అరవయ్యి ఇళ్ళు వుండేవంట. కాని ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది.షిరిడి కి డైరెక్ట్ గా రైల్ వే స్టేషన్ లేదు.నాగర్ సోల్ అని ఒక వూరు షిరిడి కి అరవయ్యి కిలో మీటర్ లలో వుంది.
అక్కడ దిగిన వెంటనే టాక్సీ కాని బస్సు కాని ఎక్కి వెళ్ళాలి. టాక్సీ కి యాబయ్యి రూపాయలు చెప్తారు కాని ముప్పయ్యి కి కూడా వస్తారు(బాగా బేరం ఆడితేనే) తర్వాత గంటన్నర ప్రయాణం చేస్తే షిరిడి కి వెళ్తాము.షిరిడి లో వైస్యాస్ కి బ్రహ్మిన్స్ కి వేరే సత్రాలు ఉన్నాయి. అందరికి బాబా దేవస్థానం నుంచి అతి తక్కువ కర్చుతోనే రూమ్స్ కూడా ఇస్తున్నారు.అవి వంద నుండి నాలుగు వందలదాకా(ఏ సి అయితే ) వుంటాయి.
ఈ రూమ్స్ గురు పౌర్ణమి నాడు చాలా రద్దీగా వుంటాయి.అప్పుడు మాత్రమూ నెల రోజుల ముందు బుక్ చేయవలసి వుంటుంది.షిరిడి లో రేట్లు చాల తక్కువగా వుంటాయి.చాలా పుణ్య క్షేత్రాలలో ఎక్కువ రేట్లు పెడతారు మనం వేరే దిక్కు లేక కొంటాము.కాని ఇక్కడ వారందరూ మామూలు రేట్ లకే అమ్ముతారు.ఇక్కడ తెలుగు అస్సలు కనపడదేమో అని చాలా బయ పడ్డాను కాని వేరే స్టేట్ వెళ్ళినా కుడా మన వూరిలో ఉన్నట్టే వుంటుంది.అంత మంది తెలుగు వాళ్ళు పాతుకుపోయారు.హింది అస్సలు రాక పోయినా కూడా మొత్తం తిరిగి రావచ్చు.అంత మంది వుంటారు.ఇక్కడ అందరు దాదాపు వినమ్రత తోనే వుంటారు. షిరిడి లో మేము వారం రోజులు ఉన్నము.మాకు కుదిరి నంతలో దగ్గరలో ఉన్న మూడు జ్యోతిర్లింగాలను చూసాము (జ్యోతిర్ లింగాలు అంటే ఏమిటి అని అడగద్దు నాకు కూడా సరిగ్గా తెలియదు.కాని మొత్తం పన్నెండు ఉంటాయని మాత్రం తెలుసు ).
ఇక్కడ చాలా మంది హోటల్స్ వారు తెలుగు భోజనం అని మోసం చేస్తారు. తీరా చూస్తె అది ఫ్రైడ్ రైస్. కాబట్టి షిరిడి దేవస్థానం వారి బక్త నివాస్ పక్కనే శ్రీ సాయి రాజ్ హోటల్ వుంది.అక్కడ మాత్రం పక్కా ఆంధ్ర భోజనం పెడతారు. ఎందుకంటే వారు తెలుగు వారు.ప్రస్తుతానికి ఒక భోజనం యబయ్యి రూపాయలు.దేవస్థానం వారు బక్త నివాస్ లోనే ఆరు రూపాయలు కి భోజనం పెడతారు కాని మనకి పడదు ఎందుకంటే అందులో మసాలా ఎక్కువ వాడతారు.ఇంతకీ బక్త నివాస్ అంటే ఏమిటో తెలుసా, గుడికి ఒక కిలో మీటర్ దూరంలో దేవస్థానం వారి సత్రం.ఇక్కడ కాఫీ ఒక్క రూపాయిన్నర, టీ రూపాయి కి ప్రస్తుతానికి ఇస్తున్నారు(ఇది ఇరవయ్యి నాలుగు గంటల సర్వీసు).బాబా గుడిలో మమూలుగా అయితే రద్దీ వుండదు,ఫ్రీ గానే దర్సనం అవుతుంది కాని గురువారం,ఆదివారం,గురు పౌర్ణమికి అటు వారం ఇటు వారం,ఏదయినా పండగలప్పుడు మాత్రం రద్దీ గా వుంటుంది.దర్సనం తనివి తీరా సంతృప్తిగా చేస్తుకున తర్వాత మనం జ్యోతిర్ లింగాల దర్శనానికి బయలు దేరచ్చు.
మీకు ఒక సారి మొత్తం చెప్తాను జాగ్రత్తగా చూడండి
(ఒకటి)
మీరు రైల్ దిగి టాక్సీ లో వెళ్తున్నప్పుడు షిరిడి రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మీకు గుడి తగులుతుంది. కానీ దేవస్థానం వారి బక్త నివాస్ కి తీసుకెళ్ళమని అడిగితే వాడు ఇంకొంచెం సేపు పోనించి ఒక పేద్ద ఆర్చ్ వున్నా చోట ఆపుతారు దాని మీద బక్త నివాస్ అని హింది లో వుంటుంది.అక్కడ రూమ్స్ కాలి వుంటే సరి లేక పోతే ఒక ఫాం పూర్తీ చేసి వాళ్లకి ఇస్తే దాని మీద ఒక నెంబర్ ఎసి ఇస్తాడు,అదే రూం నెంబర్ ఆ రూం నెంబర్ బయట డిస్ప్లే అయినప్పుడు మనకి రూం వచ్చినట్టు అన్నమాటా! అంటే ఇప్పుడు మనకి రూం దొరికింది.కొంచెం ఫ్రెష్ అప్ అవ్వండి.
ఇక మనకి తర్వాత కావలసింది భోజనం,మీకు రుచి చూడాలనుకుంటే మహా రాష్ట్ర భోజనం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది.ఇక్కడ మన ఆంధ్ర భోజనం లా,
(రెండు)
లేక పోతే, మన బక్త నివాస్ లో నే ఆరు రూపాయలకి భోజనం దొరుకుతుంది.కానీ రొట్టెలు దానిలోకి కూర మరియు అన్నం కొంచెం చారు పోస్తారు అన్నీ అన్ లిమిటెడ్ కానీ మనకి కొంచెం కష్టం,
లేక పోతే, మీ బక్త నివాస్ బయటకి వచ్చి గుడి వయిపు రెండు అడుగులు వేస్తె హోటల్ సాయి రాజ్ వుంటుంది.అక్కడ ఒక్కొక్కరికి ప్రస్తుతానికి యాబయి రూపాయలు తీసుకుంటున్నారు,
లేక పోతే, ఇంకొంచెం దూరం వచ్చి ఎవరిని అడిగినా చిలకలూరి పేట వారి సత్రం గురించి చెప్తారు,ఇక్కడ కూడా భోజనం బాగుంటుంది,కానీ మనం వచ్చే ముందే వారికి వస్తున్నామని చెప్పాలి,అప్పుడే కదా వారు సరిపడా వండుకుంటారు. వుదయాన్నే టిఫ్ఫెన్ కావాలంటే అక్కడ స్వీట్ మాత్రమే దొరుకుంతుంది,కావాలంటే తినచ్చు లేక పోతే ఆ చిలక లూరి పేట సత్రం దాటి కొంచెం దూరం వెళితే అక్కడ శ్రీకులం వారు మన ఆంధ్ర టిఫ్ఫెన్ వండుతారు అది కుడా సరసమయిన ధరలకే.
(మూడు)
ట్రావెల్స్ వారు కుడా తెలుగు వారే నాయుడు గారి దగ్గర వున్నంతలో బాగుంటుంది.ఇక్కడ డ్రైవర్స్ కి ఎవరికీ తెలుగు రాదు మరియు మన అంత కూల్ గా వుండరు. వారు మైండ్ వేరే గా వుంటుంది.కాబట్టి కొంచెం జాగ్రత్తగా వుండాలి.
ఇప్పుడు నేను చెప్పిన వాణ్ణి బక్త నివాస్ నుంచి బాబా గుడికి వెళ్ళే దారిలో వరసగా వుంటాయి.
(1)బక్త నివాస్
(2)కేశినేని ట్రావెల్స్
(3)హోటల్ సాయి రాజ్
(4)చిలకలూరి పేట వారి బోజన శాల
(5)శ్రీకాకుళం వారి ఆంధ్ర హోటల్
(కొంచెం దూరం వెళ్ళగానే )
(6)సాయి బాబా గుడి.
0 comments:
Post a Comment